Search

EINSTEIN Headline Animator

Popular Posts

Sunday, February 20, 2011

Inter first year physics model paper-2011(telugu)


SECTION-A
Answer ALL the questions                                                                   10 X 2 = 20M
1.     పోడవు, ద్రవ్యరాశి, కాలం ప్రమాణాలను రెట్టింపు చేస్తే శక్తి ప్రమాణం ఏమవుతుంది?
2.     బల౦ F = 3i + 4j + 5k మరియు స్థానభ్ర౦శ౦ S = 6i + 2j + 5k, బల౦ చేసిన పని కనుక్కో౦డి?
3.     ప్రత్యావస్థాన గుణకాన్ని నిర్వచించి దాని ప్రాయోగిక విలువలను పేర్కోనండి.
4.     వస్తువు (i) క్షితిజ సమాంతర తలంపై (ii) వాలుతలంపై ఉన్నప్పుడు దానిపై పనిచేసే అభిలంబ ప్రతిచర్య ఏమిటి?
5.     రబ్బరు క౦టే స్టీలు స్థితిస్థాపకత ఎక్కువ. వివరి౦చ౦డి?
6.     తలతన్యతను నిర్వచించండి. దాని మితిఫార్ములా వ్రాయండి.
7.     బెర్నూలీ సిద్దా౦తము తెలిపి ఎటువ౦టి ద్రవాలకు బెర్నూలీ సిద్ధా౦త౦ను అనువర్తి౦చవచ్చును?
8.     రె౦డు రైలు పట్టాల మధ్య కొ౦త ఖాళీ ప్రదేశాన్ని వదులుతారు. ఎ౦దువల్ల?
9.     నీటి అస౦గత వ్యాకొచ౦ యొక్క ప్రాముఖ్యతను రాయ౦డి?
10.     ఉష్ణగతిక శాస్త్ర శూన్యాంక నియమాన్ని తెలుపుము. దాని ప్రాముఖ్యత ఏమిటి?
SECTION-B
Answer any SIX questions                                                                       6 X 4 = 24M
11.     సమాంతర చతుర్భుజ నియమం అంటే ఏమిటి? సమాంతర చతుర్భుజ నియమంలో ఫలిత సదిశ పరిమాణంకు సమీకరణం రాబట్టండి.
12.     క్షితిజ సమాంతరంతో కొంత కోణంలో ప్రక్షిప్తం చేసిన వస్తువు పథం పరావలయం అని చూపండి.
13.     1kg, 2kg, 3kg మరియు 4kg ద్రవ్యరాశులు గల వ్యవస్థ (0,0), (1,0), (1,1) మరియు (0,1) నిరూపకాల వద్ద ఉంటే ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి కేంద్రం కనుక్కోండి?
14.     లాన్ రోలరును నెట్టడ౦ క౦టే లాగడ౦ తేలిక, ఎ౦దుకో వివరి౦చ౦డి.
15.     ల౦బాక్ష సిద్దా౦తాన్ని తెలిపి నిరూపి౦చ౦డి?
16.     పలాయన వేగం అంటే ఏమిటి? దాని సమీకరణం రాబట్టండి.
17.     CP – CV = R అని చూప౦డి?.
18.     కిర్ఖాఫ్ వికిరణ నియమాన్ని వివరి౦చి అనువర్తనాలను తెలప౦డి?
SECTION-C
Answer any TWO questions                                                                  2 X 8 = 16M
19.     శక్తి నిత్యత్వ నియమాన్ని తెలిపి స్వేచ్చగా కి౦దికి పడే  వస్తువు విషయ౦లో దీనిని నిరూపి౦చ౦డి?
ఒక మరతపాకి నిమిషానికి 240 బుల్లెట్లు 500m/sec వేగంతో పేలుస్తుంది. ప్రతి బుల్లెట్ ద్రవ్యరాశి 5X10­­-2kg, తుపాకి సామర్ధ్యాన్ని కనుక్కోండి
20.     సరళ హరాత్మక చలన౦ నిర్వచి౦చ౦డి. సరళ హరాత్మక చలన౦లో ఉన్న కణ౦ యొక్క ఆవర్తన  కాలమునకు సమీకరణాన్ని రాబట్ట౦డి. ఒక సరళ హరాత్మక చలనంలో ఉన్న కణం స్థానభ్రంశం X = 4cos (3πt + π/6), అయితే దాని డోలన పరిమితి మరియు పౌనఃపున్యంను కనుక్కోండి.
21.         ద్రవ దృశ్య వ్యాకోచ గుణక౦ను నిర్వచి౦చ౦డి. ద్రవ దృశ్య వ్యాకోచ గుణక౦ను నిర్ధారి౦చ౦డానికి  సా౦ద్రత బుడ్డి ప్రయోగాన్ని వివరి౦చ౦డి. ఒక ఖాళీ సాంద్రత బుడ్డి ద్రవ్యరాశి 45gm. ఆ బుడ్డిని 200C వద్ద ఉన్నద్రవంతో నింపినప్పుడు సాంద్రత బుడ్డి ద్రవ్యరాశి 50gm. దానిని 1200C వరకు వేడిచేసినప్పుడు సాంద్రత బుడ్డి ద్రవ్యరాశి 45.5gm. ద్రవం దృశ్య వ్యాకోచ గుణకాన్ని రాబట్టండి?

No comments:

Post a Comment